![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 23 లో.. కొత్తగా మొదలైన ఈ సీరియల్ లోని పాత్రలు చాలా కొత్తగా ఉన్నాయి. సీతాకాంత్, రామలక్ష్మిలు ఎప్పుడు కలుస్తారనే క్యూరియాసిటి ఉండగా.. మాణిక్యం గతమేంటా అనే ఇంటెన్స్ అందరిలోని ఉంది. నిన్న, మొన్నటి ఎపిసోడ్ లలో మాణిక్యాన్ని శ్రీలత డైరెక్ట్ గా చూసి షాక్ అయి సీతాకాంత్ కి ఫోన్ చేసి రమ్మంటుంది. అది విని తొందరగా వచ్చి ఇంట్లోని సీసీటీవి కెమెరాలన్నీ చూడగ అందులో మాణిక్యం ఎంట్రీ చూసి షాక్ అవుతాడు. దా మామా వచ్చావా? నీకోసమే చూస్తున్నా అనే మాటతో ఆ ఎపిసోడ్ ముగిస్తారు.
నిన్నటి ఎపిసోడ్ లో సీతాకాంత్ బాల్యాన్ని చూపిస్తారు. సీతాకాంత్ వాళ్ళ అమ్మ ప్రెగ్మెంట్ గా ఉంటుంది. నాన్న చంద్రకాంత్ బిజినెస్ పని మీద వెళ్ళి పట్నం నుండి వాళ్ళ ఇంటికొస్తాడు. అయితే మాణిక్యం వారి కుటుంబానికి ఎంతో నమ్మకంగా ఉంటాడు. ఎంత అంటే అసలు మాణిక్యం చెప్తే చూడకుండా సంతకాలు పెట్టేంత నమ్మకంగా ఉంటాడు. హడావుడిగా ఉన్న సీతాకాంత్ వాళ్ళ నాన్న దగ్గరికి ఓ గవర్నమెంట్ ఆఫీసర్ అని ఒకతడిని తీసుకొస్తాడు మాణిక్య. అతనొచ్చి మన ఊరికి వాటర్ ప్లాంట్ వస్తోంది. మీవి పదెకరాలు ఇస్తే గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుందని అతడు చెప్పగా ఈ ఊరివాళ్ళకి మంచి జరుగుతుందంటే స్వచ్ఛందంగా ఇస్తానని సీతాకాంత్ వాళ్ళ నాన్న చంద్రకాంత్ అంటాడు. అది విని అందరు సంతోషిస్తారు. ఇక కొన్ని పేపర్ల మీద సంతకాలు చేయిస్తాడు మాణిక్యం. మరుసటి రోజు పేపర్ లో చంద్రకాంత్ వాళ్ళ బ్యాంక్ దివాలా తీసిందని పేపర్ లో చూసి అతను షాక్ అవుతాడు. అప్పుడే పోలీసులు వచ్చి.. కొన్ని కోట్ల ప్రజల డబ్బుని తీసుకొని మీరు విదేశాలకు వెళ్తున్నారని, అక్రమంగా ప్రజలని దోచుకున్నారని మీ నమ్మకస్తుడైన మాణిక్యం మాకు వాంగ్మూలం ఇచ్చాడని చెప్తారు. అది విని చంద్రకాంత్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఎందుకు మాణిక్యం ఇలా చేశావని చంద్రకాంత్ అనగా.. మేక వన్నె పులి, తేనె పూసిన కత్తి ఈ చంద్రకాంత్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అంటూ పోలీసుల ముందు నటిస్తుంటాడు మాణిక్యం. ఆ తర్వాత సీతాకాంత్ వాళ్ళ నాన్నని పోలీసులు తీసుకెళ్తారు. వారింటికి సీల్ వేయగా శ్రీలత, సీతాకాంత్ వాళ్ళ తమ్ముడు, సీతాకాంత్ కట్టుబట్టలతో ఓ పాత ఇంటికి వస్తారు. ఇక అప్పుడే వాళ్ళ అమ్మకి పురిటినొప్పులు వస్తాయి. దాంతో దగ్గర్లోని డాక్టర్ దగ్గరికి సీతాకాంత్ పరుగున వెళ్ళి తీసుకొస్తాడు. తరువాయి ఎపిసోడ్ లో నాకొక హెల్ప్ చేస్తావా అని రామలక్ష్మిని సీతాకాంత్ అడుగగా.. చెప్పండి అని రామలక్ష్మి అంటుంది. మా చెల్లి వెంబడి ప్రేమ దోమ అంటూ ఎవడో వెంబడి పడుతున్నాడంట. వాడెవడో తెలుసుకోవాలని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఇక అదే సమయంలో ధన ఫోన్ కి సిరి వీడియో పంపిస్తుంది. ఈ రోజు నా బర్త్ డే.. నువ్వు మా ఇంటికి రాకపోతే నా డెర్త్ డే అవుతుందని సిరి ఆ వీడియోలో చెప్తుంది. ఇక అప్పుడే ధన దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. ఈమె తెలుసా అని అడుగగా అతను షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |